సీఎం ఇంట్లో కరోనా కలకలం
జార్భండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం రేగింది. ఆయనతో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలకు కరోనా సోకింది.
జార్భండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం రేగింది. ఆయనతో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలకు కరోనా సోకింది. ముఖ్యమంత్రి నివాసంలో మొత్తం 15 మందికి కరోనా సోకింది. దీంతో వైద్యులు మిగిలిన వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి నివాసంలో 62 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
పదిహేను మందికి....
ముఖ్యమంత్రి ఇంట్లో కరోనా కలకలం రేగడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయింది. నివాసాన్ని శానిటైజ్ చేస్తున్నారు. వారి కుటుంబంతో గత వారం రోజుల నుంచి కాంటాక్ట్ అయిన వారందరికీ పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కోరారు.