అప్పటి వరకూ బిందాస్... జూన్ నుంచి ఫోర్త్ వేవ్
కరోనా ఫోర్త్ వేవ్ ఎంట్రీ కలవరపెడుతుంది. నాలుగోవేవ్ కు ఇంకా నాలుగు నెలలే సమయం ఉందని నిపుణులు చెబుతున్నారు
కరోనా థర్డ్ వేవ్ ముగిసిందనుకునేలోగా కొత్త వేరియంట్ రెడీ ఉందన్న నిపుణుల హెచ్చరికలు భయపెడుతున్నాయి. కరోనా ఫోర్త్ వేవ్ పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే మూడు వేవ్ లతో గత రెండేళ్లుగా అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాం. ఎంతమందినో ఆత్మీయులను కోల్పోయాం. ధర్డ్ వేవ్ పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే వెళ్లిపోయింది. క్రమంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటం, సాధారణ జీవనానికి జనం అలవాటు పడ్డారు.
జూన్ 22 నుంచి....
అయితే ఈ నేపథ్యంలో కరోనా ఫోర్త్ వేవ్ ఎంట్రీ కలవరపెడుతుంది. నాలుగోవేవ్ కు ఇంకా నాలుగు నెలలే సమయం ఉందని నిపుణులు చెబుతున్నారు. జూన్ నుంచి ఫోర్త్ వేవ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. నాలుగో దశ జూన్ 22 నుంచి ప్రారంభమవుతుందన్న అంచనాలు వినపడుతున్న నేపథ్యంలో ముఖానికి మాస్క్ లు, చేతులకు శానిటైజర్, భౌతిక దూరం పాటించడం వంటివి కంటిన్యూ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.