గుడ్ న్యూస్ : వచ్చే నాలుగు వారాల్లో కరోనా ఉద్ధృతి తగ్గుతుంది !

దేశంలో ప్రస్తుతం ఒమిక్రాన్ లోని ఉపరకమైన బీఏ.2 వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ రకం కేసులు ఆర్టీపీసీఆర్ పరీక్షల

Update: 2022-02-02 05:55 GMT

ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న కరోనా, ఒమిక్రాన్ కేసులతో భారత్ అల్లాడిపోతోంది. ఈ రాకాసి వైరస్ ఎప్పుడు పూర్తిగా అంతరించిపోతుందా అని ఎదురుచూస్తున్నారు ప్రజలు. ఈ తరుణంలో ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే నాలుగు వారాల్లో కరోనా, ఒమిక్రాన్ ల ఉద్ధృతి క్రమంగా తగ్గుతుందని ప్రముఖ వైద్య నిపుణుడు, ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డి.నాగేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికాలో కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ల కేసులు ఎంత వేగంగా పెరిగాయో.. అంతే వేగంగా తగ్గాయని నాగేశ్వర్ పేర్కొన్నారు. అలా పోల్చుకుంటే.. ఇక్కడ కూడా రానున్న నాలుగు వారాల్లో కరోనా తీవ్రత తగ్గిపోతుందని చెప్పుకొచ్చారు.

దేశంలో ప్రస్తుతం ఒమిక్రాన్ లోని ఉపరకమైన బీఏ.2 వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ రకం కేసులు ఆర్టీపీసీఆర్ పరీక్షలకు చిక్కడం లేదని గతంలోని వైద్య నిపుణులు తెలిపారు. ఆ విషయాన్నే డాక్టర్ నాగేశ్వర్ గుర్తుచేశారు. కరోనా నిర్థారణ పరీక్షల్లో ఎస్ జీన్ కనిపించకపోతే ఒమిక్రాన్ గా గుర్తించడం సాధ్యపడేది. కానీ, బీఏ.2 రకం అలా కాదు. ఎస్ జీన్ గుర్తించిన వారిలోనూ వెలుగు చూస్తోంది అని తెలిపారు. గతంలో చెప్పుకున్నట్లు.. ఒమిక్రాన్ వ్యాప్తే ఎక్కువ కానీ.. తీవ్రత మాత్రం తక్కువేనని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధి బాధితుల్లో మాత్రం ఒమిక్రాన్ తీవ్రత కనిపిస్తోందని, ఒమిక్రాన్ సోకి.. తగ్గిన కొందరిలో నీరసం, బలహీనత కనిపిస్తున్నాయని తెలిపారు.



Tags:    

Similar News