గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో

Update: 2024-03-07 15:24 GMT

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్ నెస్ అలవెన్స్ లను నాలుగు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 46 శాతంగా ఉన్న డియర్ నెస్ అలవెన్స్.. ఇకపై 50 శాతం అవ్వనుంది. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సులతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చివరి డీఏ పెంపు అక్టోబర్ 2023లో 4 శాతం పెంపుతో 46 శాతానికి పెరిగింది. దీంతో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ 49లక్షల మంది, 68మంది పెన్షనర్లు లబ్ధిపొందనున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖాజానాపై అదనంగా రూ.12,868.72 కోట్లు భారం పడనుంది. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2024 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

డీఏ పెంపుతో పాటు రవాణా అలవెన్స్, క్యాంటీన్ అలవెన్స్, డిప్యుటేషన్ అలవెన్స్‌లను 25 శాతం పెంచారు. గ్రాట్యుటీ కింద ప్రయోజనాలు ప్రస్తుతం ఉన్న రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు.


Tags:    

Similar News