టపాసులు కొన్నా, పేల్చినా.. రూ.200 జరిమానా, 6 నెలలు జైలు
ఇప్పుడు దీపావళి పండుగ రాబోతోంది. ఉన్న వాయుకాలుష్యానికి తోడు.. దీపావళి రోజున కాల్చే టపాసులు వల్ల అది రెట్టింపవుతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఎంతలా అంటే.. అక్కడి వాయుకాలుష్యం.. తెల్లని మంచులా వ్యాపించేంత. ఆ కాలుష్యం వల్ల ఇప్పటికే చాలా మంది అనారోగ్యం బారిన పడ్డారు. వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకే.. సరి, బేసి సంఖ్యల్లో వాహనాలు నడపాలన్న నియమాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చింది కేజ్రీవాల్ ప్రభుత్వం.
ఇప్పుడు దీపావళి పండుగ రాబోతోంది. ఉన్న వాయుకాలుష్యానికి తోడు.. దీపావళి రోజున కాల్చే టపాసులు వల్ల అది రెట్టింపవుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం టపాసులు కాల్చడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. బాణసంచా సంబరాలు లేకుండానే ఢిల్లీ వాసులు పండుగను జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బాణసంచాను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఢిల్లీ పరిధిలో బాణసంచా కొనుగోలు చేసినా, కాల్చినా కూడా రూ.200 జరిమానా, 6 నెలలు జైలు శిక్ష ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.