ప్రొఫెసర్ సాయిబాబాకు ఊరట

ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబాకు న్యాయస్థానంలో ఊరట లభించింది. నిర్దోషిగా ప్రకటించింది.

Update: 2022-10-14 06:50 GMT

ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబాకు న్యాయస్థానంలో ఊరట లభించింది. సాయిబాబాకు గడ్చిరోలి కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం నాగపూర్ జైలులో సాయిబాబా శిక్ష అనుభవిస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 2017లో సాయిబాబాను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి సాయిబాబాబ జైలులో శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు.

నిర్దోషిగా...
అయితే ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చింది. సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. జీవితఖైదులో ఆయన అప్పీల్ ను అనుమతించింది. ఇదే కేసులో మరో ఐదుగురిని కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఒకరు మరణించారు. మిగిలిన వారిని కూడా వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.


Tags:    

Similar News