హేమంత్ సోరెన్ కు షాక్... సీఎం పదవి ఊడినట్లేనా?

జార్ఖండ్ ముఖ్మమంత్రి హేమంత్ సోరెన్ కి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆయనపై అనర్హత వేటు వేయాలనిసిఫార్సు చేసింది. ఎ

Update: 2022-08-25 07:18 GMT

జార్ఖండ్ ముఖ్మమంత్రికి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని గవర్నర్ కు సిఫార్సు చేసింది. ఎన్నికల కమిషన్ సిఫార్సుతో జార్ఖండ్ లో ముఖ్యమంత్రిపై గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. బీహార్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మైనింగ్ లీజును తనకు తానే కేటాయించుకున్నారని గవర్నర్ కు భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేసింది. అనర్హత వేయవచ్చా? లేదా? అని గవర్నర్ ఎన్నికల కమిషన్ అభిప్రాయాన్ని కోరారు.

శాసనసభ్యత్వాన్ని కూడా...
దీనిపై విచారణ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం గవర్నర్ రమేష్ బైస్ కు నివేదిక సమర్పించింది. ముఖ్యమంత్రి పై అనర్హత వేటు వేయాలని, ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, శాసనసభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని సూచించింది. దీనిపై గవర్నర్ చర్యలు తీసుకోవాల్సి ఉంది.


Tags:    

Similar News