వావ్.. పెట్రోలు ధరలు తగ్గుతున్నాయటగా
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలన్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం దాదాపుగా వచ్చిందంటున్నారు. గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి.
క్రూడాయిల్ ధరలు...
అయినా భారత్ లో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గలేదు. సెంచరీ దాటి చాలా రోజులయింది. అయితే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు పెట్రోలు, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలియవచ్చింది. ఎంత మేరకు తగ్గుతుందో తెలియదు కాని కొంత మేరకు ధరలు తగ్గే అవకాశముందంటున్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడంతో నిత్యావసరాల ధరలు కూడా మండిపోతున్నాయి. కాగా రాష్ట్రాలు అంగీకరిస్తే పెట్రోలు, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తెస్తామన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన కూడా దీనిపై ఆశలు రేపుతున్నాయి.