సామాన్యుడికి ఊరట.. తగ్గనున్న వంటనూనెల ధరలు

ముడి సోయా, పొద్దుతిరుగుడు నూనెల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ, వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి మినహాయిస్తున్నట్లు కేంద్రం..

Update: 2022-05-25 04:56 GMT

న్యూఢిల్లీ : నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న సామాన్యుడికి ఇది కాస్త ఊరటనిచ్చే విషయమే. త్వరలోనే వంటనూనెల ధరలు తగ్గనున్నాయి. ఈ దిశగా కేంద్రం ఆలోచనలు చేస్తోంది. ముఖ్యంగా సోయాబిన్, సన్ ఫ్లవర్ ఆయిల్ ల తయారీకి కావాల్సిన ముడిపదార్థాలపై సుంకాలను తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. అలాగే.. కొన్ని దిగుమతులపై విధిస్తున్న వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్ ను తగ్గించడంపై కూడా కేంద్రం చర్చలు జరుపుతోంది.

ముడి సోయా, పొద్దుతిరుగుడు నూనెల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ, వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి మినహాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఈ మినహాయింపు వర్తిస్తుందని ఆర్థికశాఖ పేర్కొంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో.. వంటనూనెల ధరలు తగ్గడంతో పాటు.. ద్రవ్యోల్బణం కూడా అదుపులోకి వస్తుందని భావిస్తోంది.
కాగా.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్రం సెస్ ను తగ్గించిన విషయం తెలిసిందే. సెస్ తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంధన ధరలపై విధించే ట్యాక్స్ లపై కోతలు విధిస్తే ఈ ధరలు మరింత తగ్గి.. సామాన్యుడికి ఊరటనిస్తుందని ప్రజల అభిప్రాయం.


Tags:    

Similar News