బలపరీక్షలో నెగ్గిన షిండే సర్కార్

ఏక్‌నాధ్ షిండే ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. కొద్ది సేపటి క్రితం జరిగిన బలపరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు.

Update: 2022-07-04 06:16 GMT

మహారాష్ట్రలో ఏక్‌నాధ్ షిండే ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. కొద్ది సేపటి క్రితం జరిగిన బలపరీక్షలో షిండే నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. షిండే ప్రభుత్వానికి 164 మంది సభ్యుల మద్దతు లభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేసిన తర్వాత ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవిస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ, శివసేన రెబల్స్ కలసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

164 ఓట్లతో...
అయితే నిన్న జరిగిన స్పీకర్ ఎన్నికలోనూ బీజేపీ కూటమి నెగ్గింది. మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈరోజు ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. 144 మ్యాజిక్ ఫిగర్ కాగా, షిండే ప్రభుత్వానికి 164 మంది మద్దతు షిండేకి లభించింది. దీంతో ఆయన సర్కార్ బలపరీక్షలో నెగ్గినట్లయింది.


Tags:    

Similar News