మూడు జాతీయ పార్టీలకు ఝలక్
కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు పార్టీలకు జాతీయ హోదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు పార్టీలకు జాతీయ హోదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, ఎన్సీపీలకు జాతీయ హోదా రద్దు చేసింది. ఇటీవల వరసగా జరిగిన ఎన్నికల ఫలితాల ఆధారంగా ఈ నిర్ణయం కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకుంది.
ఆమ్ ఆద్మీపార్టీకి మాత్రం...
అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం కొత్తగా జాతీయ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఆప్‌కు ఈ హోదా లభించింది. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, బీఎస్పీ, కఆప్, నేషనల్ పీపుల్స్ పార్టీ ఆఫ్ మేఘాలయ పార్టీలు మాత్రమే జాతీయ హోదాను కలిగి ఉన్నాయి. ఇక బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్ కు కూడా గట్టి షాక్ తగిలందనే చెప్పాలి. తెలంగాణలో మాత్రమే దానిని రాష్ట్ర పార్టీగా గుర్తించింది. ఏపీలో ఆ పార్టీకి హోదా రద్దు చేసింది.