క్షీణించిన ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం...ఆసుపత్రికి తరలింపు
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు;
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అవకతవకలు జరిగాయంటూ జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ గత కొద్ది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నసంగతి తెలిసిందే. అయితే ప్రశాంత్ కిషోర్ ను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు.
పాట్నాలోని ఆసుపత్రికి...
ఆయనకు షరతులతో కూడిన నిబెయిల్ పై బయటకు విడుదలయ్యారు.కానీ నాలుగురోజుల పాటు ఆమరణ దీక్ష చేయడంతో ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం క్షీణించింది. పాట్నాలోని ఆసుపత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో నీరసించారని వైద్యులు చెప్పారు. త్వరలోనే ఆయన కోలుకుంటానని వైద్యులు చెబుతున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ