బారాముల్లాలో కాల్పులు.. ముగ్గురు జవాన్లకు గాయాలు
పోలీసులు, భద్రతా దళాల రాకతో అప్రమత్తమైన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపినట్లు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు.;
జమ్ముకశ్మీర్ లోని బారాముల్లాలో ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. ఉగ్రవాదులు - జవాన్ల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. బారాముల్లాలోని మాల్వా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో బుద్గాంకు చెందిన పోలీసులు, భద్రతా దళాలు ఆ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున గాలింపు చర్యలు చేపట్టాయి.
పోలీసులు, భద్రతా దళాల రాకతో అప్రమత్తమైన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపినట్లు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జవాన్ల పరిస్థితి బాగానే ఉందని, ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని వెల్లడించారు.