ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఈడీ సోదాలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తుంది
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తుంది. దేశ వ్యాప్తంగా 30 చోట్ల సోదాలను ఈడీ అధికారులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, లక్నో, గురుగావ్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లలో ఈ సోదాలు జరుగుతున్నాయి. రామచంద్రన్ పిళ్లైకి సంబంధించిన కార్యాలయాల్లోనూ, ఇళ్లల్లోనూ సోదాలను ఈడీ అధికారులు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ లోనే...
రాబిన్ డిస్టిలర్ పేరుతో లిక్కర్ వ్యాపారాన్ని రామచంద్రన్ పిళ్లై నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ విధానంలో అవకతవకలు జరిగినట్లు సీబీఐ అధికారులు ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియా ఇంటిపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరికొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు, హైదరాబాద్ కు లింకులున్నాయని సీబీఐ అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుండటం జరగడం చర్చనీయాంశమైంది.