ఉద్ధవ్ థాక్రేకు మరో షాక్

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు మరో షాక్ తగలనుంది. పార్లమెంటు సభ్యులు మూకుమ్మడిగా పార్టీని వీడనున్నారు.

Update: 2022-07-11 05:44 GMT

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు మరో షాక్ తగలనుంది. పార్లమెంటు సభ్యులు మూకుమ్మడిగా పార్టీని వీడనున్నారు. ఈ మేరకు ఈరోజు, రేపట్లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయనున్నారు. తమను ప్రత్యేక వర్గంగా పరిగణించాలంటూ వారు లేఖలు రాయనున్నారు. లోక్ సభలో శివసేనకు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 14 మంది పార్లమెంటు సభ్యులు శివసేనను వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

రాష్ట్రపతి ఎన్నికలు...
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా ఎంపీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో శివసేన విప్ జారీ చేస్తుంది. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపేందుకు వీలుగా 14 మంది ఎంపీలు తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని స్పీకర్ ను కోరుతూ లేఖ రాయనున్నట్లు సమాచారం. ఒక ఐదుగురు మాత్రం శివసేనలో ఉండేందుకే నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది.


Tags:    

Similar News