దక్షిణాదిన వర్షాలు.. ఉత్తరాదిన మండుతున్న ఎండలు

ఉత్తరాదిన ఆ రాష్ట్రాల్లో మరికొద్ది రోజులు ఎండల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2024-06-16 07:02 GMT

ఉత్తరాదిన ఆ రాష్ట్రాల్లో మరికొద్ది రోజులు ఎండల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నైరుతి రుతు పవనాలు ప్రవేశించినప్పటికీ ఇంకా కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలంతా కూడా ఎండల వేడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి ఎద్దడి తలెత్తుతోంది.

ఆరెంజ్ ఎలర్ట్...
ఢిల్లీలో ఈరోజు కూడా తాగు నీటి సమస్య తీరలేదు. ప్రజలు నీటి కోసం అల్లాడిపోతున్నారు. దీంతో పాటు ఎండలు కూడా దంచి కొడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుంటే ఉత్తరాదిన మాత్రం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈరోజు నుంచి జూన్ 18 వరకు ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో తీవ్రమైన ఎండల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.


Tags:    

Similar News