మాజీ ప్రొఫెసర్ సాయిబాబా మృతి
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా మరణించారు. హైదరాబాద్‌లో నిమ్స్ లో ఆయన చికి్తస పొందుతూ మృతి చెందారు;
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా మరణించారు. హైదరాబాద్‌లో నిమ్స్ లో ఆయన చికి్తస పొందుతూ మృతి చెందారు. ఆయనకు మావోయిస్టులతో సంబంధలాలున్నాయన్న ఆరోపణలపై అరెస్టయి జైలులో కొన్నేళ్ల పాటు ఉన్నారు. నాగ్‌పూర్ జైల్లో శిక్ష అనుభవించిన సాయిబాబా ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. ఉద్యమకారుడిగా, రచయితగా, విద్యావేత్తగా ప్రొఫెసర్ సాయిబాబాకు పేరుంది.
మావోయిస్టుల సానుభూతిపరుడని...
2014లో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో ఉండగానే ఆయన పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేసిన సాయిబాబాకు అనేక ఉద్యమకారులతో సంబంధాలున్నాయన్నది పోలీసుల ఆరోపణ. దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందున ఆయనను అరెస్ట్ చేసి జైలులో పెట్టామని పోలీసులు చెబుతున్నారు. సాయిబాబా మృతి పట్ల ప్రజా సంఘాల నేతలు సంతాపాన్ని ప్రకటించారు.