పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు.. నలుగురి మృతి
ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో నలుగురు ప్రయాణికులు మరణించారు.;
ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో నలుగురు ప్రయాణికులు మరణించారు. ఇరవై మందికి పైగానే గాయపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్ లోని గోండా జిల్లాలో చండీగఢ్ - డిబ్రూగడ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. చండీగఢ్ నుంచి అసోంలోని డిబ్రూగడ్ కు బయలుదేరిన ఈ రైలు ఝులాహి రైల్వేస్టేషన్ కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురయింది.
20 మందికి గాయాలు...
మొత్తం పదహారు బోగీలు పట్టాలు తప్పాయి. అందులో నాలుగు ఏసీ బోగీలు, పన్నెండు జనరల్ బోగీలున్నాయి. బోగీలు పక్కకు ఒరిగిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అక్కడకు చేరుకున్న రైల్వే సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.