Karnataka : కర్ణాటకలో ఫ్రీ బస్సు ఎఫెక్ట్.. ఛార్జీలు పెంచుతూ నిర్ణయం

కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రభుత్వానికి భారంగా మారింది. దీంతో ఆర్టీసీ ఛార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది;

Update: 2025-01-03 02:36 GMT

కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రభుత్వానికి భారంగా మారింది. దీంతో ఆర్టీసీ ఛార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నెలకు దాదాపు 400 కోట్ల రూపాయల ఖర్చవుతుండటంతో ఆ భారం మోయలేని ప్రభుత్వం ఇప్పుడు ఛార్జీలను పెంచింది.

కేబినెట్ ఆమోదం...
బస్సు టికెట్ ధరలను 15 శాతం పెంచేందుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో జనవరి ఐదో తేదీ నుంచి పెరిగిన కొత్త ఛార్జీలు అమలులోకి వస్తాయని మంత్రి పాటిల్ తెలిపారు. ఛార్జీల పెంపుదలతో రోజుకు ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని భావించి ఆర్టీసీ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమయింది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News