పాస్ పోర్టు కోసం పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్‌ పై కీలక నిర్ణయం

పాస్‌పోర్ట్ సంబంధిత సేవలను పౌరులకు అందించే ప్రక్రియను సులభతరం చేయడానికి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలను

Update: 2022-09-26 13:13 GMT

పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ (పీసీసీ) లేనిదే కొన్ని దేశాలకు మనం వెళ్లలేం. ఒకప్పుడు పోలీసు క్లియరెన్స్ కు సంబంధించి చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. అయితే ఇప్పుడు కొన్ని మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇలా పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ దక్కించుకునే సమయంలో లంచాలకు కూడా ఆస్కారం లేకపోలేదు. పాస్‌పోర్ట్ సంబంధిత సేవలను పౌరులకు అందించే ప్రక్రియను సులభతరం చేయడానికి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇకపై పోస్ట్ ఆఫీస్ లలోని పాస్‌పోర్ట్ సేవాలో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC) కోసం దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని చేర్చాలని నిర్ణయించింది. భారతదేశం అంతటా ఈ కేంద్రాలు (POPSKలు) బుధవారం (సెప్టెంబర్ 28) నుండి ప్రారంభమవుతాయి. పాస్ పోర్ట్ క్లియరెన్స్ సర్టిఫికేట్‌ల డిమాండ్‌ కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఈ నిర్ణయం తీసుకోబడింది. "ఈ పిసిసి అప్లికేషన్ సదుపాయాన్ని పిఒపిఎస్‌కెలకు విస్తరించడంలో మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్య, విదేశాలలో ఉపాధిని కోరుకునే భారతీయ పౌరులకు సహాయం చేయడమే కాకుండా విద్య, దీర్ఘకాలిక వీసా, ఎమిగ్రేషన్ వంటి ఇతర పిసిసి అవసరాల డిమాండ్‌ను కూడా తీర్చగలదు." అని ప్రకటన పేర్కొంది. పాస్‌పోర్టు సేవా కేంద్రాలతో పాటు తపాలా శాఖ ప్రధాన కార్యాలయాల ద్వారా వీటిని జారీ చేయాలని నిర్ణయించింది.

పీసీసీల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుని విదేశాంగ శాఖ ఆధ్వర్యంలోని పాస్‌పోర్టు కార్యాలయాల్లో అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉండేది. పలు వెళ్లేవారికి పీసీసీలు తప్పనిసరి కావడంతో ఆన్‌లైన్‌లో స్లాట్‌ను బుక్‌ చేసుకుని నిర్ణీత సమయంలో రీజనల్‌ పాస్‌పోర్టు కార్యాలయాలకు వెళ్తున్నారు. పాస్‌పోర్టు కార్యాలయాల ద్వారా పీసీసీలు పొందాలనుకుంటే స్లాట్‌ బుకింగ్‌కు నెలకు మించి ఎక్కువ సమయం పడుతోంది. ఇది చాలా మందికి సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో పీసీసీల జారీని వేగవంతం చేయడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News