బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధరలు నేడు

Update: 2023-09-24 02:51 GMT

బంగారం ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. శుక్ర, శనివారాల్లో బంగారం ధర తగ్గగా.. ఆదివారం కాస్త పెరిగింది. వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధరలు నేడు పెరిగాయి. ఆదివారం రూ. 110 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 60 వేలకు చేరువ అయింది. సెప్టెంబర్ 24న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,950గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 110 పెరిగింది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,100గా ఉంది. హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,950గా కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,950గా కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,210లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,230 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,950గా కొనసాగుతోంది.
వెండి ధర కూడా నేడు కాస్త పెరిగింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర ఆదివారం రూ. 75,800లుగా ఉంది. కిలో వెండి ధర రూ. 300 పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 79,300లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 79,300ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 75,800గా నమోదైంది. చెన్నైలో రూ. 79,300గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 74,250 గా కొనసాగుతూ ఉంది.


Tags:    

Similar News