బంగారం కొనుగోలుదారులకు శుభవార్త

అంతే విలువ ఇస్తారు కూడా. ఇటీవల క్రమంగా పెరుగుతూ వెళ్లిన ధరలు.. ఇప్పుడు మళ్లీ తగ్గుతున్నాయి. రూ.61 వేల దిశగా..

Update: 2023-07-23 04:09 GMT

దేశీయంగానే కాదు.. అంతర్జాతీయంగానూ బంగారానికి డిమాండ్ ఉంటుంది. కాకపోతే మన దేశంలో బంగారాన్ని కొంచెం ఎక్కువగా ప్రేమిస్తారు. అంతే విలువ ఇస్తారు కూడా. ఇటీవల క్రమంగా పెరుగుతూ వెళ్లిన ధరలు.. ఇప్పుడు మళ్లీ తగ్గుతున్నాయి. రూ.61 వేల దిశగా పరుగులు పెట్టిన బంగారం ధర మళ్లీ రూ.60 వేలకు తగ్గుతుంది. ఆదివారం 10 గ్రాముల బంగారం పై రూ.250 నుంచి రూ.280 మేర తగ్గింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై రూ.1000 మేర తగ్గింది.

ఉదయం 6 గంటల వరకూ ఉన్న సమాచారం మేరకు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,150గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,160గా ఉంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ నేటి బంగారం ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరల విషయానికొస్తే.. కిలో వెండిపై రూ.1000 తగ్గడంతో.. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో కిలో వెండి ధర రూ.80,500గా ఉంది.


Tags:    

Similar News