మగువలకు షాక్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి వాటి ధరలతో పని ఉండదు. అందుకు తగిన డబ్బుంటే చాలు.. బంగారం కొంటుంటారు.

Update: 2022-08-31 03:03 GMT

బంగారం ధరల్లో మార్పులకు నిర్థిష్ట సమయమేదీ ఉండదు. అనేక కారణాలతో బంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ ఉంటాయి. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి వాటి ధరలతో పని ఉండదు. అందుకు తగిన డబ్బుంటే చాలు. బంగారం కొంటుంటారు. పెళ్లిళ్లు, పండుగల సమయాల్లోనే కాదు.. మామూలు రోజుల్లోనూ బంగారం కొనుగోళ్లు బాగానే జరుగుతున్నాయి. ఇక బంగారం ధరలు ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులపై ఆధారపడి ఉంటాయి. నిన్నటి ధరల కంటే.. నేటి బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

తాజాగా 10 గ్రాముల బంగారం ధర పై రూ.110 రూపాయలు పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,540గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,250 ఉంది. ఇక వెండి ధరల విషయానికొస్తే.. హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.60,100 గా ఉంది.


Tags:    

Similar News