పెరగలేదు.. తగ్గలేదు.. స్థిరంగా గోల్డ్ రేట్స్
పైగా ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. కొనుగోళ్లు పెరిగాయి. ప్రతిరోజూ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు సహజం. ఒకరోజు పెరిగితే
బంగారం ధరలు ఎలా ఉన్నా.. ప్రతి నిత్యం వాటి కొనుగోళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ధరలు తగ్గినపుడు కొని, పెరిగినపుడు అమ్ముకుని సొమ్ముచేసుకునేవాళ్లు కొందరైతే.. ధరలు ఎలా ఉన్నా బంగారం కొనుగోలు చేసేవాళ్లు మరికొందరు. పైగా ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. కొనుగోళ్లు పెరిగాయి. ప్రతిరోజూ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు సహజం. ఒకరోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతుంటాయి. ఈ రోజు ఉదయం 6 గంటల వరకూ బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,300 ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,420గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఈ ధరలు కొనసాగుతున్నాయి. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. నేడు కిలో వెండి ధర రూ.79,000 గా ఉంది.