గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్
ఎప్పుడో ఒకసారి బంగారం ధర భారీగా తగ్గుతుంటుంది. బంగారాన్ని మెచ్చని వారుండరు. ముఖ్యంగా మహిళలకు
బంగారం, వెండి ధరలు నిలకడగా ఉండవు. ఒకరోజు తగ్గితే.. మరొక రోజు పెరుగుతుంది. స్వల్పంగా తగ్గినపుడు ధర భారీగా పెరుగుతుంటుంది. ఎప్పుడో ఒకసారి బంగారం ధర భారీగా తగ్గుతుంటుంది. బంగారాన్ని మెచ్చని వారుండరు. ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ఏ ఫంక్షన్ అయినా, పెళ్లిళ్లైనా.. అలంకరణలో తొలి ప్రాముఖ్యత బంగారానికే ఇస్తారు. ఇక.. నేటి బంగారం, వెండి ధర విషయానికొస్తే.. 10 గ్రాముల బంగారంపై రూ.490 తగ్గింది. వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది.
ఈరోజు (మే26) ఉదయం 6 గంటల వరకూ ఉన్న సమాచారం ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో బంగారం, వెండి ధరలిలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,800గా ఉంది. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.60,870గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కిలో వెండి ధరపై రూ.500 తగ్గగా.. తెలుగు రాష్ట్రాల్లో ధర రూ.76,500 గా ఉంది.