స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి కూడా అదే బాటలో..
ఒకరోజు ధర తగ్గితే.. మరో రోజు తగ్గుతుంది. ఒక్కోసారి వేల రూపాయల్లో బంగారం ధర తగ్గుతుంది.
బంగారం ధరల్లో ప్రతిరోజూ హెచ్చుతగ్గులు సహజం. అయితే ఎప్పుడు ధర పెరుగుతుంది ? ఎప్పుడు తగ్గుతుంది ? అనేది అంచనా వేయడం కాస్త కష్టమే. ఒకరోజు ధర తగ్గితే.. మరో రోజు తగ్గుతుంది. ఒక్కోసారి వేల రూపాయల్లో బంగారం ధర తగ్గుతుంది. ఇలా జరగడం చాలా అరుదు. ఇక తాజా ధరల విషయానికొస్తే.. నిన్న రూ.550 నుంచి రూ.600 తగ్గిన బంగారం ధర.. నేడు 10 గ్రాముల ధరపై రూ.150-160 పెరిగింది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండి ధర రూ.300 పెరిగింది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,850 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,380 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,850 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,380 గా ఉంది. కిలో వెండి ధర రూ.300 పెరగడంతో.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో కిలో వెండి ధర రూ.74,000 ఉంది. 100 గ్రాముల వెండి ధర 74,000 గా ఉంది.