క్రమంగా తగ్గుతున్న బంగారం ధరలు
తగ్గిన ధరలతో.. తాజాగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ..
బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి.బంగారం ధర ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో చెప్పడం కష్టం. అందుకే ధర కాస్త తగ్గినప్పుడే బంగారాన్ని కొనుగోలు చేసుకోవాలి. వరుసగా రెండోరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల బంగారంపై రూ.160 తగ్గుముఖం పట్టగా.. కిలో వెండి పై రూ.300 తగ్గింది.
తగ్గిన ధరలతో.. తాజాగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,710కి తగ్గింది. కేరళ, కోల్ కతాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కిలో వెండి ధరరూ.76,200గా ఉంది. రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,800 గా ఉండగా..24 క్యారెట్ల ధర రూ.60,860గా ఉంది.