పసిడి ధరలకు బ్రేకులు.. స్వల్పంగా పెరిగిన వెండి
నిన్నటి ధరలే నేడూ కొనసాగుతున్నాయి. బంగారం ధర స్థిరంగా ఉంది. బంగారం ధరలు పెరిగినా, తగ్గినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు.
పెళ్లిళ్ల సీజన్ మొదలయ్యే సమయానికి బంగారం ధరలు పెరుగుతున్నాయి. మూడురోజులు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. నిన్న భారీగా పెరిగాయి. నిన్నటి ధరలే నేడూ కొనసాగుతున్నాయి. బంగారం ధర స్థిరంగా ఉంది. బంగారం ధరలు పెరిగినా, తగ్గినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. ధరలతో సంబంధం లేకుండా కొనుగోళ్లు చేస్తుండటం పరిపాటిగా మారింది. డబ్బు ఉంటే ఖర్చైపోతుంది.. అదే బంగారం ఉంటే.. ఏదొక రకంగా ఉపయోగపడుతుందని కొనుగోలు చేసేవారు చాలా మంది. బంగారం కొనుగోలుకు సమయంతో పనిలేదు. చేతిలో డబ్బు ఉంటే చాలు. ప్రజలకు రోజురోజుకీ బంగారంపై మక్కువ పెరిగిపోతుంది.
తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,670 రూపాయలు పలుకుతుండగా.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,360 రూపాయలు వద్ద స్థిరంగా ఉన్నాయి. బంగారం ధర నిలకడగా ఉంటే, వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలోపై రూ.300 వరకు దిగి వచ్చింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.67,100 గా ఉంది.