Customs: ఒక్కసారిగా తగ్గిపోనున్న బంగారం ధరలు

కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించడంతో

Update: 2024-07-23 10:28 GMT

కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించడంతో హైదరాబాద్, ఇతర నగరాల్లో బంగారం, వెండి ధరలు తగ్గుదల బాట పట్టాయి. బంగారం, వెండిపై సుంకాన్ని 6 శాతానికి తగ్గించారు. ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గింది. బంగారం, వెండి ప్లాటినంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలనే డిమాండ్ ఆభరణాల పరిశ్రమలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆ డిమాండ్ వైపు మొగ్గు చూపించింది. సుంకం తగ్గింపు భారతదేశంలో బంగారం-వెండి డిమాండ్‌ను మరింత పెంచే అవకాశం ఉంది.

ప్రస్తుతం నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 73,580గా ఉంది. ప్రస్తుతం నగరంలో వెండి ధర కిలో రూ. 95,600కి చేరుకుంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 67600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 73730గా ఉంది. వెండి కిలో ధర 91100 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News