మళ్లీ రూ.60వేల మార్క్ ను దాటేసిన గోల్డ్.. నేటి ధరలు ఇలా

హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 100 పెరిగి రూ.55,700 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల..;

Update: 2023-07-21 04:22 GMT
gold and silver prices today, gold rates in hyderabad, july 21 gold rates

gold and silver prices today

  • whatsapp icon

కొద్దిరోజుల క్రితం రూ.66 వేల మార్క్ కు చేరిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. ఆ తర్వాత క్రమంగా స్వల్ప హెచ్చుతగ్గులతో రూ.57 వేల వరకూ దిగొచ్చింది. ఇటీవల ధరలు పెరుగుతుండటంతో.. మళ్లీ బంగారం ధర రూ.60 వేల మార్కును దాటేసింది. అందుకు కారణం పెళ్లిళ్ల సీజన్ వస్తుండటమే అని నిపుణులు అంటున్నారు. అధిక శ్రావణమాసంలో ముహూర్తాలు లేకపోయినా.. వచ్చేనెల ఆఖరి వారం నుంచి పెళ్లిళ్లు దండిగా జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి నుంచే బంగారం కొనుగోళ్లకు డిమాండ్ పెరుగుతోంది. నిన్న 10 గ్రాముల బంగారంపై రూ.500 మేర పెరిగి రూ.60 వేలు దాటగా.. నేడు కూడా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 100 పెరిగి రూ.55,700 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,750కు చేరింది. ఈ ధరలు త్వరలోనే రూ.61 వేలకు చేరినా ఆశ్చర్య పోనక్కర్లేదు. ఇక విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి తదితర ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,750గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,750గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 61,200 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,700లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర 60,750గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,750 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.82,400 వద్ద స్థిరంగా ఉంది.


Tags:    

Similar News