రైతులందరికీ గుడ్ న్యూస్
దేశంలోని రైతులందరికీ గుడ్ న్యూస్. నేడు పీఎం కిసాన్ నమ్మాన్ నిధి యోజన స్కీమ్ కింద రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
దేశంలోని రైతులందరికీ గుడ్ న్యూస్. నేడు పీఎం కిసాన్ నమ్మాన్ నిధి యోజన స్కీమ్ కింద రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కిసాన్ స్కీమ్ 13వ విడత నగదు నేడు రైతుల ఖాతాల్లో పడనుంది. దేశ వ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతులు ఈ పథకం కింద లబ్ది పొందనున్నారు.
రైతుల ఖాతాల్లో...
ఇందుకోసం 16,800 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ నిధులు జమ కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయల చొప్పున ఏడాదిలో మూడు విడతలుగా ఆరు వేల రూపాయల నిధులను ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. పదమూడో విడత నిధులు నేడు ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.