నల్లగా ఉన్నావంటున్నారు : తమిళి సై
తనను బాడీషేమింగ్ చేస్తున్నారని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. నల్లగా ఉన్నానంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారన్నారు
కొందరు తనను బాడీషేమింగ్ చేస్తున్నారని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు. తాను నల్లగా ఉన్నానంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారని అన్నారు. చెన్నైలోని ఒక బాలికల కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనను ట్రోల్ చేసే వారికి తమిళి సై సౌందర్ రాజన్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
ట్రోల్ చేసినా...
నల్లగా ఉన్నానని ట్రోల్ చేసినా తాను నొచ్చుకోనని, వారందరూ ఊహించని స్థాయికి తాను ఎదుగుతానని తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు. బాడీ షేమింగ్ చేయడం ఇటీవల కొందరికి ఫ్యాషన్ గా మారిపోయిందన్నారు. నల్లగా ఉన్నా తాను అగ్గిలా ఉంటానని ఆమె వ్యాఖ్యానించారు. కొందరు చేస్తున్న ట్రోలింగ్ ను తాను పెద్దగా పట్టించుకోనని తమిళి సై తెలిపారు.