నవంబర్ 15న సెలవు.. ఈ విషయాలను తెలుసుకోండి

భారతదేశం లోని చాలా పాఠశాలలకు సెలవు ప్రకటించారు

Update: 2024-11-14 11:37 GMT

నవంబర్ 15, 2024న, భారతదేశం లోని చాలా రాష్ట్రాలలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గురునానక్ జయంతిని పురస్కరించుకుని సెలవును పాటిస్తారు. గెజిటెడ్ సెలవుదినంగా జరుపుకుంటారు.

ఇక పంజాబ్‌లో యువ విప్లవకారుడు కర్తార్ సింగ్ సరభ గౌరవార్థం నవంబర్ 16న పాఠశాలలు రెండు రోజులు మూసివేయనున్నారు. సాంప్రదాయ పండుగ అయిన రహస్ పూర్ణిమ కోసం ఒడిశా పాఠశాలకు సెలవు ఉంది. గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా చాలా బ్యాంకులు నవంబర్ 15న మూతపడనున్నాయి. ఈ సెలవుదినం కరుణ, వినయం, సేవతో సహా గురునానక్ సూచించిన విలువలను ప్రతిబింబించే అవకాశాన్ని అందిస్తుంది. పంజాబ్‌లో, ఈ సంవత్సరం పాఠశాలలు రెండు రోజులు మూసివేయనున్నారు. నవంబర్ 15 గురునానక్ జయంతి వేడుకలకు అంకితం చేయగా, నవంబర్ 16 స్వాతంత్ర్య సమరయోధుడు, కర్తార్ సింగ్ శరభా జయంతి కారణంగా సెలవు ప్రకటించారు.
ఈ రాష్ట్రాల్లో పాఠశాలలు మూసివేయనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు:
పంజాబ్
ఢిల్లీ
ఉత్తర ప్రదేశ్
హర్యానా
పశ్చిమ బెంగాల్
మిజోరం
ఒడిశా
మధ్యప్రదేశ్
తెలంగాణ
అరుణాచల్ ప్రదేశ్
రాజస్థాన్
జమ్మూ
నాగాలాండ్
ఛత్తీస్‌గఢ్
జార్ఖండ్


Tags:    

Similar News