పంజాబ్ లో రాష్ట్రపతి పాలన విధించాలి !

పంజాబ్ లో చరణ్ జీత్ సింగ్ చన్నీ ప్రభుత్వాన్ని రద్దు చేసి.. రాష్ట్రపతి పాలన విధించాలని

Update: 2022-01-07 11:51 GMT

ప్రధాని మోదీ బుధవారం పంజాబ్ లో పర్యటించేందుకు వెళ్లగా.. అక్కడ తలెత్తిన భద్రతా లోపమే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ అంశంపైనే కాంగ్రెస్ - బీజేపీల మధ్య మాటల యుద్ధం కూడా జరుగుతోంది. అయితే మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యాలపై కేంద్రహోంశాఖ కఠిన నిర్ణయాలు తీసుకున్ అవకాశముందని మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇలా చెప్పారో లేదో.. మర్నాడే హర్యానా సీఎం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

పంజాబ్ లో చరణ్ జీత్ సింగ్ చన్నీ ప్రభుత్వాన్ని రద్దు చేసి.. రాష్ట్రపతి పాలన విధించాలని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పాలనలోనే మరికొద్దివారాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పంజాబ్ లో శాంతి, భద్రతలను కాపాడటంలో విఫలమైందని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన హోంమంత్రి అనిల్ విజ్, హర్యానా బీజేపీ చీఫ్ ఓపీ ధనకర్ తో కలిసి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు మెమోరాండం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం ఖట్టర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఇతర పార్టీ సీనియర్ నేతలతో కలిసి పంచకులలోని మాతా మాన్సా దేవి ఆలయంలో మోదీ దీర్ఘాయుష్షు కోసం ఓ యజ్ణం,మహా మృత్యుంజయ కార్యక్రమం నిర్వహించారు.




Tags:    

Similar News