లాంగ్ కోవిడ్.. క్యాన్సర్ కంటే ప్రమాదం

లండన్ యూనివర్సిటీకి చెందిన యూసీఎల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియోలజీ అండ్ హెల్త్ విభాగంలోని వైద్యుల బృందం..

Update: 2023-06-08 12:13 GMT

దీర్ఘకాలిక కోవిడ్ (long covid) బాధితుల్లో వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది క్యాన్సర్ కంటే ప్రమాదమని అధ్యయనం పేర్కొంది. వైరస్ సోకిన తర్వాత ఎక్కువకాలం కోలుకోని వారి ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తున్నాయని, ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. లంగ్ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ లో ఉన్న బాధితుల కంటే అధిక సమస్యలు కనిపిస్తాయని తేల్చింది. ఈ మేరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ కేర్ రీసెర్చ్ జర్నల్ లో ఓ కథనం ప్రచురితమైంది.

ఈ అధ్యయనంలో భాగంగా దీర్ఘకాలంపాటు కోవిడ్ తో బాధపడిన 3,750 మంది రోగులపై పరిశోధనలు జరిపారు. లండన్ యూనివర్సిటీకి చెందిన యూసీఎల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియోలజీ అండ్ హెల్త్ విభాగంలోని వైద్యుల బృందం ఈ పరిశోధన చేపట్టింది. కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత రోగుల ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్న దానిపై ఈ పరిధిశోదన చేసింది. ఈ పరిశోధనకు ఓ డిజిటల్ యాప్ ను రూపొందించింది. అందులో రిజిస్టర్ చేసుకున్న వారి నుండి అలసట, నిరాశ, ఆందోళన, మెదడు చురుకుదనంపై ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. అత్యధికశాతం మంది అలసటతో బాధపడుతున్నట్లు తేలింది.
దీర్ఘకాలిక కోవిడ్ (long covid) బాధితుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైందని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన డా.హెన్రీ గుడ్ ఫెలో వెల్లడించారు. వారిలో 90 శాతం మంది 18 నుండి 65 ఏళ్ల లోపువారేనని తెలిపారు. కోవిడ్ సోకిన తర్వాత మునుపటిలా పనిచేయలేకపోతున్నామని 51 శాతం మంది పేర్కొన్నారు.


Tags:    

Similar News