Kerala : ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్.. గల్లంతయిన వారంతా వారేనట
కేరళలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎనిమిది జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది
కేరళలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాయనాడ్ జిల్లాలో 150 మందికి పైగా మరణించారు. కొండచరియలు విరిగిపడి ఇళ్లు నేలమట్టం కావడంతో చాలా మంది సమాధి అయ్యారు. ఆర్మీతో పాటు ఎన్‌డీఆర్ఎఫ్ లు సహాయక చర్యలు ప్రారంభించాయి. మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఇప్పటి వరకూ ఆర్మీ వెయ్యి మందిని రక్షించగలిగింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సరైన వైద్య సౌకర్యం కల్పించి వారి ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నిస్తుంది.
కుండపోత వర్షంతో...
ముఖ్యమంత్రి పినరయి విజయన్ అక్కడే మకాం వేసి సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. దీంతో పాటు కేరళలోని ఎనిమిది జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 24గంటల వ్యవధిలో 10 సెం.మీ వర్షపాతం నమోదయింది. వయనాడ్, కొలికోడ్, మలప్పురం, కన్నూర్ లలో కుండపోత వర్షం కురుస్తుంి. వయనాడ్ లో 600 మంది వలస కార్మికుల జాడ గల్లంతయింది. వీరంతా టీ తోటల్లో పనిచేసే కార్మికులుగా గుర్తించారు. వారంతా అసాం, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వారేనని చెబుతున్నారు. మరో వైపు రాహుల్, ప్రియాంక లు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వాయనాడ్ పర్యటన వాయిదా పడింది. సహాయక చర్యలను ముమ్మరం చేశారు.