Heavy Rains : భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవులు

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి

Update: 2024-01-08 05:09 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. సరిహద్దు రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలతో పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. తమిళానాడును వరసగా వర్షాలు కమ్మేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ఐదు జిల్లాల్లో...
తమిళనాడులోని ఐదు జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలకు కలెక్టర్లు ఈరోజు సెలవులు ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో 22 సెం.మీ వర్షపాతం నమోదైందదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పలు చోట్ల రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొందరిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు చేర్చారు.


Tags:    

Similar News