అయ్యప్ప భక్తులకు హైకోర్టు ఏం చెప్పిందంటే?
శబరిమలకు వెళ్లే భక్తులకు హైకోర్టు కీలక సూచనలు చేసింది. అలా చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది
శబరిమలకు వెళ్లే భక్తులకు హైకోర్టు కీలక సూచనలు చేసింది. అలా చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. అయ్యప్ప మాలలు వేసుకుని శబరిమలకు వెళ్లడం మరి కొద్దిరోజుల్లోనే ప్రారంభమవుతుంది. త్వరలోనే ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. ఈ పరిస్థితుల్లో కేరళ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. శబరిమలకు వెళ్లే ప్రతి భక్తుడు ఇది పాటించాల్సిందేనని కోరింది. శబరిమలకు ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వెళుతుంటారు.
వాహనాలకు...
అయితే ఈ వెళ్లే సందర్భంగా మధ్యలో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. దీంతో సొంత వాహనంలో శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు రోడ్డు ప్రమాదాల కారణంగా కేరళ హైకోర్టు సూచనలు చేసింది. వాహనాలకు ఎలాంటి అలంకరణలు చేయవద్దని కోరింది. వాహనాలకు కొబ్బరి ఆకులు, అరటి చెట్లు, పూవులు, మాలలతో అలంకరించవద్దని తెలిపింది. అలా చేయడం మోటారు వాహనాల నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.