కేంద్రం కీలక నిర్ణయం.. ఎగుమతులపై నిషేధం

ఉల్లిపాయలు ధరలు పెరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు తప్పవు

Update: 2024-03-24 05:05 GMT

ఉల్లిపాయలు ధరలు పెరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. ఉల్లిఘాటుతో గతంలో అధికారాన్ని కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే ఉల్లిపాయల ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంటుంది. పైగా ఎన్నికల సమయం కావడంతో ఉల్లి ధరలు పెరిగితే దాని ఎఫెక్ట్ ఎన్నికలపై పడుతుందని భావించి వాటి ఎగుమతులపై నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకూ ఉల్లిని ఎగుమతులు చేయడానికి వీలులేదని ఆంక్షలు విధించింది.

ఘాటుతో ఎన్నికల్లో....
ఉల్లిపాయల ప్రతి వంటకంలో వినియోగిస్తారు. నిత్యవాసరవస్తువుగా ఉన్న ఉల్లిపాయ ధరలు పెరిగితే ప్రభుత్వానికి ముప్పు తప్పదు. ఇది గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబరు నెల వరకూ ఎగుమతులపై నిషేధించింది. అయితే ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ధరలు పెరిగే అవకాశముందని గ్రహించి ఎగుమతులపై నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కిలో ఉల్లి బయట మార్కెట్ ఇరవై రూపాయలకు లభ్యమవుతుంది. అంతకు మించి పెరగకుండా కేంద్రం చర్యలు తీసుకుంది.


Tags:    

Similar News