రాజస్థాన్ లో కుదరని బీజేపీ వ్యూహం

రాజస్థాన్ లో బీజేపీ వ్యూహం ఫలించలేదు. రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ లో మూడో అభ్యర్థిని నిలబెట్టి ఎన్నికలకు కారణమయింది.

Update: 2022-06-11 03:56 GMT

రాజస్థాన్ లో బీజేపీ వ్యూహం ఫలించలేదు. రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ లో మూడో అభ్యర్థిని నిలబెట్టి ఎన్నికలకు కారణమయింది. సుభాష్ చంద్రను బీజేపీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించింది. దీంతో కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను రిసార్ట్ లకు తరలించింది. రిసార్ట్ ల నుంచి నేరుగా ఓటింగ్ కు తీసుకు వచ్చి తమ అభ్యర్థులను గెలిపించుకుంది. రాజస్థాన్ లో బీజీపీకి ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకునే బలమే ఉంది. అయితే మూడో అభ్యర్థిని నిలబెట్టి బీజేపీ ఎన్నికలకు కారణమయింది.

బీజేపీలో మాత్రం....
అయితే కాంగ్రెస్ గట్టిగా ఎదుర్కొని తమ ముగ్గురు అభ్యర్థులను ముకుల్ వాస్నిక్, రణదీప్ సూర్జేవాలా, ప్రమోద్ తివారీలను గెలిపించుకుంది. బీజేపీ పోటీ చేయించిన సుభాష్ చంద్ర ఓటమి పాలయ్యారు. ఇక్కడ మహారాష్ట్రలో బీజేపీ తంత్రం పనిచేసింది. కాగా మహారాష్ట్ర నుంచి బీజేపీ తరుపున పియూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ గెలుపొందారు. శివసేన అభ్యర్థి సంజయ్ పవర్ ఇక్కడ ఓటమి పాలయ్యారు. బీజేపీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి గెలుపొందరు.


Tags:    

Similar News