శరద్ పవార్ కు ఐటీ నోటీసులు

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ లో వెల్లడించారు.;

Update: 2022-07-01 05:22 GMT
శరద్ పవార్ కు ఐటీ నోటీసులు
  • whatsapp icon

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ లో వెల్లడించారు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల సమయంలో శరద్ పవార్ సమర్పించిన అఫడవిట్లకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. నిన్న రాత్రి ఈ నోటీసులు తనకు అందాయని శరద్ పవార్ ట్విట్టర్ లో వెల్లడించారు. అయితే తన వద్ద దానికి సంబంధించిన సమాచారం అంతా ఉందని ఆయన ట్వీట్ చేశారు.

ప్రభుత్వం మారిన వెంటనే...
నిన్న రాత్రి మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయిన కొద్ది గంటల్లోనే శరద్ పవార్ కు ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంపై విపక్షాలు విమర్శిస్తున్నాయి. విపక్షాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ తపస్ పేర్కొన్నారు.


Tags:    

Similar News