డీఎంకే ఇంట్లో ఐటీ సోదాలు

తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. డీఎంకే నేత ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు.;

Update: 2023-10-05 04:54 GMT
income tax, rides, jagath rakhsn, tamilnadu
  • whatsapp icon

తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. డీఎంకే నేత ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. డీఎంకే ఎంపీ జగత్ రక్షన్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఆయన ఇంటితో పాటు పలు కార్యాలయాల్లో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు ఐటీ శాఖ దాడులు నిరసిస్తూ ఆందోళనకు దిగుతున్నాయి.

సోదాలు జరుగుతున్న...
చెన్నై, అరక్కోణం, కోయంబత్తూరు వంటి చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. జగత్ రక్షన్ డీఎంకే పార్లమెంటు సభ్యుడిగా ఉండటంతో కొంత అలజడి చేలరేగింది. మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News