ఇండియా కూటమి కీలక నిర్ణయం
పార్లమెంటు సభ్యుల సస్పెన్షన్ పై ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించింది.
పార్లమెంటు సభ్యుల సస్పెన్షన్ పై ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించింది. లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించింది. ఉభయ సభల్లో గత కొద్ది రోజుల నుంచి 92 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ కు గురయ్యారు.
పార్లమెంటుపై దాడి...
పార్లమెంటుపై జరిగిన దాడిపై కేంద్ర హోంమంత్రి, ప్రధాని వివరణ ఇవ్వాలని విపక్షాలు పట్టుబడ్డాయి. అయితే ఇందుకు అంగీకరించని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా విపక్ష సభ్యులలో అత్యధిక మందిని సస్పెండ్ చేశారు. రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు ఎక్కువ మంది సస్పెన్షన్ కు గురయ్యారు. దీనికి నిరసనగా పార్లమెంటు సమావేశాలను బహిష్కరించాలని ఇండియా కూటమి నిర్ణయించింది.