భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు

ప్రస్తుతం దేశంలో 12,597 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 0.03 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.76 శాతంగా

Update: 2022-04-04 06:32 GMT

న్యూ ఢిల్లీ : కరోనా మహమ్మారి నుంచి భారత్ కోలుకుంటోంది. రోజువారీ కేసులు భారీగా తగ్గడంతో..ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. తాజాగా కేంద్ర, వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను విడుదల చేసింది. దాని ప్రకారం గడిచిన 24 గంటల్లో 913 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 13 మంది వైరస్ బారిన పడి చనిపోయారు.

ప్రస్తుతం దేశంలో 12,597 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 0.03 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. అలాగే దేశంలో ఇప్పటి వరకూ.. 4,30,29,044 కేసులు నమోదయ్యాయని, 5,21,358 మరణాలు సంభవించాయని తెలిపింది. కరోనా నుంచి 24 గంటల్లో 1316 కోలుకున్నారని పేర్కొంది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,24,95,089 చేరుకుంది.


Tags:    

Similar News