భారత్ లో తగ్గిన కరోనా విస్తృతి.. తాజాగా ఎన్నికేసులంటే..

భారత్ లో కోవిడ్ రికవరీ రేటు 98.76 శాతం ఉండగా.. యాక్టివ్ కేసుల శాతం 0.03 శాతానికి తగ్గింది. ప్రస్తుతం దేశంలో 11,058 మంది

Update: 2022-04-14 05:28 GMT

న్యూ ఢిల్లీ : భారత్ లో ప్రాణాంతక వైరస్ కరోనా విస్తృతి కాస్త తగ్గింది. నిన్నటి బులెటిన్ లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరగగా.. నేటి కరోనా బులెటిన్ లో కేసుల సంఖ్య తగ్గింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 1007 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 818 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

భారత్ లో కోవిడ్ రికవరీ రేటు 98.76 శాతం ఉండగా.. యాక్టివ్ కేసుల శాతం 0.03 శాతానికి తగ్గింది. ప్రస్తుతం దేశంలో 11,058 మంది కరోనాతో పోరాడుతున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో మరో 26 మంది మృతి చెందడండో మృతుల సంఖ్య 5,21,736కి పెరిగింది. ఇప్పటి వరకూ దేశంలో 4,30,39,025 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 4,25,02,454 మంది కోలుకున్నారు.


Tags:    

Similar News