భారత్ లో 15 వేలు దాటిన యాక్టివ్ కేసులు
ఇదే సమయంలో దేశంలో 33 మంది కరోనా కారణంగా మృతి చెందారు. వీటిలో అత్యధిక మరణాలు కేరళలో నమోదయ్యాయి. కేరళలో..
న్యూ ఢిల్లీ : భారత్ లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరోసారి 2 వేల పై చిలుకు కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 4.5 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,527 మందికి పాజిటివ్ గా తేలింది. ఒక్క ఢిల్లీలోనే అత్యధికంగా 1,042 కేసులు నమోదయ్యాయి.
ఇదే సమయంలో దేశంలో 33 మంది కరోనా కారణంగా మృతి చెందారు. వీటిలో అత్యధిక మరణాలు కేరళలో నమోదయ్యాయి. కేరళలో 31, ఢిల్లీలో 2 కరోనా మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1656 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 15,079 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేసులు పెరుగుతుండటంతో.. దేశంలో పాజిటివిటీ రేటు 0.56 శాతానికి పెరిగి, రికవరీ రేటు 98.75 శాతానికి పడిపోయింది. దేశంలో ఇప్పటి వరకు 187 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు వేశారు.