భారత్ లో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు

మూడు నాలుగు రోజులుగా రెండువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా కేంద్ర,

Update: 2022-04-22 05:00 GMT

న్యూ ఢిల్లీ : దేశంలో నాలుగు రోజుల క్రితం వరకూ వెయ్యికి దిగువన నమోదైన కరోనా కేసులు.. గడిచిన మూడు నాలుగు రోజులుగా రెండువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా కేంద్ర, వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. దాని ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,451 మందికి కరోనా నిర్థారణ అయింది. ఇదే సమయంలో మరో 54 మంది కరోనాతో మరణించగా.. 1589 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

వీటితో కలిపి ఇప్పటివరకూ దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,30,52,425కు చేరింది. వారిలో 4,25,16,068 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. 5,22,116 మంది మృతి చెందారు. మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 98.75 శాతం మంది కోలుకోగా, 1.21 శాతం మంది మృతిచెందారని తెలిపింది. దేశవ్యాప్తంగా 1,87,26,26,515 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, నిన్న ఒక్కరోజే 18,03,558 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని వెల్లడించింది.


Tags:    

Similar News