Monsoon : మరో గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ
నైరుతి రుతుపవనాలు దేశంలోని పలు ప్రాంతాల్లో అనుకున్న తేదీ కన్నా ముందే ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది
నైరుతి రుతుపవనాలు దేశంలోని పలు ప్రాంతాల్లోకి అనుకున్న తేదీ కన్నా ముందే ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇప్పటికే కేరళలో ప్రవేశించిన రుతుపవనాలతో త్రిపుర, మేఘాలయ, అసోం, బంగాల్, సిక్కింలోకి ప్రవేశించాయని తెలిపింది.
అధిక వర్షాలు...
లక్షద్వీప్, కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లోకి ముందే ప్రవేశించే పరిస్థితులు కనిపించాయని వెల్లడించింది. ఇక మిగిలిన ప్రాంతాల్లోనూ ముందే వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షపాతం నమోదవుతుందని కూడా తెలిపింది. అనేక చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది.