ఇండియా విద్యార్థిపై అమెరికా ఎయిర్ లైన్స్ నిషేధం

శనివారం ఎయిర్ పోర్టులో దిగగానే వోహ్రా ను సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తోటి ప్రయాణికులను ఇబ్బంది..

Update: 2023-03-05 08:06 GMT

india student banned by american airlines

అమెరికా ఎయిర్ లైన్స్ విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసిన ఇండియా విద్యార్థి ఆర్య వోహ్రా (21) పై అమెరికా ఎయిర్ లైన్స్ సీరియస్ అయింది. భవిష్యత్తులో అతను తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించినట్లు సదరు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో ఆర్యా వోహ్రా మద్యం మత్తులో తోటి ప్రయాణికుడిపై మూత్రవిసర్జనకు పాల్పడ్డాడు. అయితే.. విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకని బాధిత వ్యక్తి ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేయలేదు.

కానీ.. విషయాన్ని గ్రహించిన ఆ ఫ్లైట్ సిబ్బంది.. ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. శనివారం ఎయిర్ పోర్టులో దిగగానే వోహ్రా ను సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టినందుకు ఆర్యా వోహ్రాపై నిషేధం విధించినట్టు అమెరికన్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. మద్యం మత్తులో మునిగిపోయిన అతను సిబ్బంది సూచనలను పాటించకపోగా.. సిబ్బందితో వాగ్వాదానికి దిగాడని పేర్కొంది. మరోవైపు.. వోహ్రాపై చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు కూడా తెలిపారు. ఈ ఉదంతంపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ భారత పౌర విమానయాన శాఖ అమెరికన్ ఎయిర్‌లైన్స్‌ను కోరింది.




Tags:    

Similar News