ప్రయివేటు రంగంలో తొలి ప్రయోగం
భారత అంతరిక్ష ప్రయోగంలో తొలిసారి ప్రవైట్ రంగానికి చెందిన తొలి రాకెట్ ను నేడు ప్రయోగించనుంది
భారత అంతరిక్ష ప్రయోగంలో తొలిసారి ప్రవైట్ రంగానికి చెందిన తొలి రాకెట్ ను నేడు ప్రయోగించనుంది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం ఇందుకు వేదిక కానుంది. తొలి రాకెట్ విక్రమ్ -ఎస్ ను మరికాసేపట్లో ప్రయోగించనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. సరిగ్గా ఉదయం 11.30 గంటలకు ఈ రాకెట్ ప్రయోగం జరగనుంది.
విక్రమ్ - ఎస్ గా...
ఈ ర్యాకెట్ ను హైదరాబాద్ కు చెందిన స్కెరూట్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించింది. దీనికి డాక్టర్ విక్రమ్ సారాబాయ్ పేరిట విక్రమ్ - ఎస్ గా నామకరణం చేశారు. ప్రయివేటు రంగానికి చెందిన తొలి ర్యాకెట్ ప్రయోగం జరుగుతుండటంతో భవిష్యత్ లో మరిన్ని ప్రయోగాలకు భారత్ వేదిక కానుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రాకెట్ మూడు అతి చిన్న పేలోడ్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. ఇవి వాతావరణాన్ని అధ్యయనం చేయనున్నాయి.